AP: ఆక్వా వ్యర్థాల వల్ల జల వనరులు కలుషితం కాకుండా నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని డిప్యూటీ సీఎం పవన్ అధికారులను ఆదేశించారు. ఆక్వా ప్రొసెసింగ్, ప్రీ ప్రొసెసింగ్ యూనిట్లలో నిరంతర తనిఖీలు నిర్వహించి, నమూనాలు సేకరించి పరీక్షించాలని సూచించారు. రాష్ట్రంలోని 119 ప్రొసెసింగ్, 12 ప్రీ ప్రొసెసింగ్ యూనిట్లలో తనిఖీలు చేపట్టినట్లు పీసీబీ అధికారులు తెలిపారు. 82 యూనిట్ల నుంచి నమూనాలు సేకరించగా.. నిబంధనలు పాటించని 10 యూనిట్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసి, దిద్దుబాటుకు రెండు వారాల గడువు ఇచ్చారు. ఉల్లంఘనలు కొనసాగితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పవన్ ఆదేశించారు.