ఇరాన్ అణు సంస్థ చీఫ్ మహమ్మద్ ఇస్లామి కీలక వ్యాఖ్యలు చేశారు. అణు ఇంధనాన్ని పరిరక్షించుకోవడం ఇరాన్ హక్కు అని, అమెరికాతో చర్చలకు తమ హక్కుల పరిరక్షణ అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. ఇరాన్‌పై శత్రువులు విజయం సాధించలేరని, తమపై ఆంక్షలు విధించి గెలవలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు.