AP: అరకు ఉత్సవ్‌లో ప్రోటోకాల్ రగడ నెలకొంది. అరకు ఫెస్ట్‌లో ఎస్టీ కమిషన్ సభ్యుడికి అవమానం జరిగింది. వేదికపైకి పిలవకపోవడంపై ఎస్టీ కమిషన్ సభ్యుడు సాయిరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులను కావాలనే అవమానిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మంత్రి సంధ్యారాణి సమక్షంలో ప్రోటోకాల్ వార్ జరిగింది. మంత్రి పిలిచినా వెళ్లొద్దని సాయిరామ్‌ను టీడీపీ నేతలు కోరారు. చివరికి సాయిరాంను పోలీసులు స్టేజ్ మీదకి తీసుకెళ్లారు.