AP: టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమం మరోసారి ప్రోటోకాల్ వివాదానికి దారి తీసింది. సభలో తనను సరైన క్రమంలో ఆహ్వానించలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా మంత్రి, జేసీని పిలిచి, తరువాత తనను పిలవడంపై ఆమె అభ్యంతరం తెలిపారు. “ఇదేనా ప్రోటోకాల్?” అంటూ వేదికపైనే అధికారులను నిలదీశారు. యాంకర్ వివరణ ఇవ్వడానికి ప్రయత్నించగా తిరస్కరించి, హౌసింగ్ అధికారులే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొనగా, జేసీ అక్కడి నుంచి వెళ్లిపోయారు.