పోలవరం-నల్లమల సాగర్‌కు నిధులివ్వండి: పయ్యావుల

34చూసినవారు
పోలవరం-నల్లమల సాగర్‌కు నిధులివ్వండి: పయ్యావుల
AP: రాజధాని అమరావతి నిర్మాణం, నదుల అనుసంధానం, రాయలసీమ ప్రాంతీయ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి పయ్యావుల కేశవ్ కోరారు. కేంద్ర ప్రీ బడ్జెట్ భేటీలో ఈ మేరకు పలు ప్రతిపాదనలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అందజేశారు. విశాఖపట్నం ఆర్థిక ప్రాంతీయ అభివృద్ధి కేంద్రానికి కేంద్ర బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లు కేటాయించాలన్నారు. పోలవరం-నల్లమల సాగర్ లింకు ప్రాజెక్టుకు ఆర్థిక సాయం చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్