మాజీ మంత్రి అంబటి రాంబాబుపై PT వారెంట్

34చూసినవారు
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై PT వారెంట్
సీఎం చంద్రబాబుపై దుర్భాషలాడిన కేసులో ఇప్పటికే జైల్లో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో కేసు నమోదైంది. ప్రభుత్వ పీపీపీ విధానాన్ని నిరసిస్తూ నవంబర్ 12న చేపట్టిన ధర్నాలో బారికేడ్లను తోసుకుంటూ వెళ్లినందుకు గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో అంబటిని కోర్టులో ప్రవేశపెట్టేందుకు పోలీసులు పీటీ వారెంట్‌ను దాఖలు చేశారు. ఈ నెల 11న ఆయనను కోర్టులో ప్రవేశపెట్టాలని పోలీసులు కోరారు.

సంబంధిత పోస్ట్