పబ్లిక్ టాయిలెట్ల ఏర్పాటు ప్రభుత్వాల విధి: హైకోర్టు

3031చూసినవారు
పబ్లిక్ టాయిలెట్ల ఏర్పాటు ప్రభుత్వాల విధి: హైకోర్టు
AP: రాజ్యాంగ ఆదేశిక సూత్రాల ప్రకారం ప్రజలకు పబ్లిక్ టాయిలెట్లు అందుబాటులో ఉంచడం ప్రభుత్వాల బాధ్యత అని, ఈ సౌకర్యం కల్పించలేని ప్రభుత్వాలు సంక్షేమ ప్రభుత్వాలుగా చెప్పుకోలేవని హైకోర్టు పేర్కొంది. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన జీవనం జీవించే హక్కులో భాగమని, రోడ్ల పక్కన తగినన్ని టాయిలెట్లు నిర్మించడం వల్ల మహిళలు, ట్రాన్స్‌జెండర్ల వ్యక్తిగత గోప్యతకు రక్షణ కల్పించడంతో పాటు వారి భయాలను తొలగించినట్లవుతుందని న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్‌ ఒక వ్యాజ్యంలో తీర్పు వెలువరించారు. విశాఖపట్నంలో పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణాన్ని అడ్డుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను ఆయన కొట్టివేశారు. నిర్వహణలో అశ్రద్ధ చూపితే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్