ఈ నెల 21న ఏపీలో ప‌ల్స్ పోలియో

33చూసినవారు
ఈ నెల 21న ఏపీలో ప‌ల్స్ పోలియో
AP: ఈ నెల 21న రాష్ట్రంలో ప‌ల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 54 లక్షల మందికి పైగా పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్రంలో 38,267 సెంటర్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే జిల్లాలకు 61,26,120 పోలియో డ్రాప్స్ డోస్‌లు పంపిణీ చేశారు. 5 ఏళ్ల లోపు  పిల్ల‌లకు పోలియో చుక్కల్ని తప్పకుండా వేయించాలని అధికారుల సూచించారు.