సొరకాయ జ్యూస్‌తో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయని నిపుణులు వెల్లడించారు. విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండే ఈ జ్యూస్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇంకా బరువు నియంత్రణలోనూ, చర్మ, కేశ సంరక్షణలోనూ, శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలోనూ, విష పదార్థాలను తొలగించడంలోనూ సహాయపడుతుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేసే సొరకాయ జ్యూస్‌ను వడకట్టకుండా ఉదయం లేదా సాయంకాలం తీసుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.