ఐపీఎల్ 2026 సీజన్‌లో కేకేఆర్ విజయం కోసం ఎదురుచూస్తోంది. సోమవారం కోల్‌కతా నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ వర్షంతో రద్దయింది. ఈ నేపథ్యంలో, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ఠ అయ్యర్, కేకేఆర్‌కు ఒక పాయింట్ ఇచ్చేశామని, బతికి బట్టకట్టండి అని వ్యాఖ్యానిస్తూ వీడియో పోస్ట్ చేసింది. ఇది కేకేఆర్ అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. శ్రేష్ఠ అయ్యర్ తన వ్యాఖ్యలు సరదా కోసమేనని, ఎవరినీ అగౌరవపరిచే ఉద్దేశం లేదని వివరణ ఇచ్చింది.