హోమ్ గ్రౌండ్‌లో పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్‌పై భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్, యువ ఆటగాడు కూపర్ కానల్లీ అరంగేట్రం మ్యాచ్‌లోనే విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్‌ను పంజాబ్ బౌలర్లు కట్టడి చేశారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (39), జోస్ బట్లర్ (38) రాణించినప్పటికీ, మిగిలిన వారు వేగంగా పరుగులు చేయలేకపోయారు. పంజాబ్ బౌలర్ వైశాఖ్ విజయ్‌కుమార్ 3 కీలక వికెట్లు తీయగా, చాహల్ 2 వికెట్లతో ఆకట్టుకున్నాడు.