AP: రాష్ట్రంలో కొత్తగా 1,500 బస్సులను కొనుగోలు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే 1,050 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేశామని, నెల రోజుల్లో అవి అందుబాటులోకి వస్తాయన్నారు. స్త్రీ శక్తి పథకం రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతోందన్నారు. స్త్రీ శక్తి బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 90 శాతంగా ఉందన్నారు.