AP: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు దేశానికే గర్వకారణమని మంత్రి
లోకేశ్ అన్నారు. ప్రతి భారతీయుడూ గర్వించేలా చేశారని అన్నారు. విశాఖలో ‘PV సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్’ నిర్మాణ పనులకు మంత్రి
లోకేశ్ బుధవారం భూమిపూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఈ సభలో ఉన్న పిల్లలను చూస్తుంటే.. భారతదేశ భవిష్యత్తు మన ఎదురుగా కూర్చున్నట్టు అనిపిస్తోంది. జీవితం మనల్ని ఎక్కడకు తీసుకెెళ్తోందో మనకు ఎవరికీ తెలియదు. కానీ వ్యవస్థ మీ ప్రతి ప్రయత్నంలో కేటలిస్టు పాత్ర పోషించగలదనేదే నా నమ్మకం’ అని అన్నారు.