AP: అమరావతిలో మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 3న దాన్ని ఆవిష్కరిస్తామని, దేశంలోని వివిధ ప్రాంతాలకు అమరావతి నుంచే క్వాంటమ్ కంప్యూటర్ సాంకేతికతను అందిస్తామని చెప్పారు. ఈ మేరకు శనివారం విజయవాడలో జరుగుతున్న పాన్ ఐఐటీ ఆంధ్రప్రదేశ్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. విదేశాల్లోని ఐటీ నిపుణుల్లో 35 శాతం మంది భారతీయులేనని, దేశ ప్రగతికి ప్రతిభావంతులంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు.