పొగ తాగ‌డం మానేస్తే.. వారం రోజుల్లో వచ్చే మార్పులు ఇవే!

333చూసినవారు
పొగ తాగ‌డం మానేస్తే.. వారం రోజుల్లో వచ్చే మార్పులు ఇవే!
పొగ తాగ‌డం మానేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, ప్రతి ఏడాది 70 లక్షలకుపైగా మంది పొగాకు వినియోగంతో మరణిస్తున్నారు. అయితే ధూమపానం మానేస్తే శరీరం స్వయంగా మరమ్మత్తు ప్రక్రియను ప్రారంభిస్తుంది. కేవలం ఒక వారంలోనే ఆరోగ్యం, శక్తి, శరీర పనితీరులో మార్పులు కనిపిస్తాయి. మొదటి రోజు గుండె స్పందన, రక్తపోటు మెరుగుపడతాయి. రక్తంలో ఆక్సిజన్ స్థాయి పెరుగుతుంది. 2వ రోజు వాసన, రుచి సామర్థ్యం మెరుగుపడుతుంది. 3-7 రోజుల్లో శ్వాసలో సౌలభ్యం, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్