రబీ సాగు నిరాశాజనకం

39చూసినవారు
రబీ సాగు నిరాశాజనకం
ఆంధ్రప్రదేశ్‌లో రబీ సాగు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ఈ సీజన్‌లో 20.70 లక్షల హెక్టార్లలో 22 రకాల పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేయగా, ఇప్పటివరకు కేవలం 6.57 లక్షల హెక్టార్లలోనే రైతులు పంటలు వేశారు. మొంథా, దిత్వా తుఫాన్ల వల్ల ఖరీఫ్ పంటల కోతలు ఆలస్యం కావడం, కృష్ణా డెల్టా, సాగర్ కుడి కాలువ కింద వరి సాగుకు నీటి గ్యారంటీ లేకపోవడం వంటివి దీనికి ప్రధాన కారణాలని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you