ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా, ఆయన కెరీర్ లో మైలురాయిగా నిలిచిన 'రేసు గుర్రం' చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రీ రిలీజ్ చేశారు. కొన్ని థియేటర్లలో అల్లు అర్జున్ అభిమానులు చేసిన సంబరాలు, ముఖ్యంగా ఒక థియేటర్ లో గుర్రాలను తీసుకొచ్చి సందడి చేయడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. గత ఏడాది 'ఆర్య 2' రీ రిలీజ్ కు మంచి స్పందన వచ్చినా, 'రేసు గుర్రం' రీ రిలీజ్ కు ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.