రుణ ఎగవేత కేసులో రఘురామకు బెయిల్ మంజూరు

బ్యాంకుల రుణ ఎగవేత కేసులో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజుకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కోర్టుకు వ్యక్తిగతంగా హాజరైన రఘురామకు రూ. 50 వేల ష్యూరిటీ బాండ్‌పై బెయిల్ మంజూరు అయింది. తదుపరి విచారణను కోర్టు జులై 6కి వాయిదా వేసింది.
