రబీలో రాగులు సాగు - ముఖ్య సూచనలు

4653చూసినవారు
రబీలో రాగులు సాగు - ముఖ్య సూచనలు
రాగులు విత్తే ముందు విత్తనశుద్ధి తప్పనిసరి. కార్బండజిమ్ 2గ్రా. లేదా మాంకోజెబ్ 2గ్రాములతో విత్తనాలను శుద్ధి చేయాలి. తేలికపాటి దుక్కిచేసిన తర్వాత విత్తనం చల్లి, పట్టెతో కప్పి, ఆపై నారుపోసి నాటాలి. 85-90 రోజుల రకాలకు 21 రోజుల వయస్సు గల మొక్కలను, 105-125 రోజుల పంటకాలం గల రకాలకు 30 రోజుల వయస్సు గల మొక్కలను నాటాలి. స్వల్పకాలిక రకాలకు వరుసల మధ్య 15 సెం.మీ., మొక్కల మధ్య 10 సెం.మీ. దూరం పాటించాలి. దీర్ఘకాలిక రకాలకు వరుసల మధ్య 15-20 సెం.మీ., మొక్కల మధ్య 15 సెం.మీ. దూరం ఉండేలా విత్తాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్