భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ వ్యక్తిత్వంపై టీమిండియా బ్యాటర్ అజింక్యా రహానే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మైదానంలో ఎంత ప్రశాంతంగా ఉంటారో, మైదానం వెలుపల కూడా అంతే సాధారణ వ్యక్తిగా ధోనీ ఉంటారని ఆయన తెలిపారు. ధోనీ చాలా సాధారణ మనిషి, ఎప్పుడూ ప్రశాంతంగా, కూల్‌గా ఉంటాడని, అతని గది తలుపు ఎప్పుడూ తెరిచే ఉండేదని, ఎవరైనా లోపలికి వచ్చి
క్రికెట్ గురించి మాట్లాడవచ్చు, సరదాగా గడపవచ్చు అనే సంకేతాన్ని ఆయన అలా ఇచ్చేవారని రహానే చెప్పారు. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా అందరినీ ఒకేలా చూసే నాయకత్వ లక్షణం ధోనీలో ప్రత్యేకమని రహానే ప్రశంసించారు.