సైనిక స్కూళ్ల ప్రైవేటీకరణపై రాహుల్ గాంధీ ఫైర్

13764చూసినవారు
సైనిక స్కూళ్ల ప్రైవేటీకరణపై రాహుల్ గాంధీ ఫైర్
సైనిక స్కూళ్లను ప్రైవేటీకరించడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఢిల్లీలో జరిగిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ డిఫెన్స్ మెంబర్స్‌ సమావేశంలో ఆయన కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సైనిక్ స్కూళ్లను ఆర్‌ఎస్‌ఎస్‌కు అప్పగిస్తున్నారని ఆయన ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను బీజేపీ ఎంపీలు ఖండించారు. ఈ అంశంపై ప్రభుత్వం నుంచి పూర్తి నివేదిక కావాలని కమిటీ చైర్మన్ రాధా మోహన్ సింగ్ అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్