రైల్వే స్టేషన్లలో నీరు తాగొచ్చా?.. తనిఖీల్లో బయటపడ్డ నిజాలు ఇవే!

554చూసినవారు
రైల్వే స్టేషన్లలో నీరు తాగొచ్చా?.. తనిఖీల్లో బయటపడ్డ నిజాలు ఇవే!
AP: విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు నిర్వహించిన భారీ తనిఖీల్లో రైల్వే స్టేషన్లలోని నీరు తాగడానికి సురక్షితమని తేలింది. 99 స్టేషన్ల నుంచి సేకరించిన 633 నీటి నమూనాలలో హానికరమైన బ్యాక్టీరియా ఏది కనుగొనబడలేదు. 83 స్టేషన్లలో 9,571 క్లోరినేషన్ స్థాయి పరీక్షలలో 99.93 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఆరు ప్రదేశాలలో స్వల్ప తేడాలు గుర్తించినా, వెంటనే సరిదిద్దారు. ఈ చర్యల వల్ల ప్రయాణికులకు ఆరోగ్య భద్రతతో పాటు ఆర్థికంగానూ ఊరట లభిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్