AP: రైల్వే నెట్‌వర్క్ అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టుల వేగవంతం లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక అడుగులు వేశాయి. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లు విశాఖపట్నంలో మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న సుమారు రూ.లక్షా 20 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టుల పురోగతి, నూతన రైల్వే జోన్ ఏర్పాటు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.