భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన తొలి టీ 20 మ్యాచ్ రద్దు అయింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను రద్దు చేశారు. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి
భారత్ 189 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఓపెనర్ అభిషేక్ శర్మ అర్ధ సెంచరీలతో మెరిశారు.
భారత్ ఇన్నింగ్స్ పూర్తైన తర్వాత వర్షం మొదలు కాగా, ఇరుజట్ల ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌కే పరిమితమయ్యారు. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. శనివారం మాంచెస్టర్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ రెండో టీ 20 జరగనుంది.