హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షం కారణంగా బేగంపేట్ రైల్వే స్టేషన్ పైకప్పు నుండి వర్షపు నీరు జలపాతంలా కిందికి ప్రవహించింది. దీంతో ప్లాట్‌ఫారమ్‌లు నీటితో నిండిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనుల్లో నాణ్యత లోపించిందని, అందుకే ఈ దుస్థితి ఏర్పడిందని నెటిజన్లు విమర్శిస్తున్నారు.