AP: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న మూడు రోజుల్లో ఉత్తరాంధ్రలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే ప్రమాదం ఉంది. తీరం వెంబడి గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఈ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా రేపు శ్రీకాకుళం, పోలవరం, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.