ఏపీలో వారం రోజులపాటు వర్షాలు

25చూసినవారు
ఏపీలో వారం రోజులపాటు వర్షాలు
ఏపీలో రాబోయే వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అక్కడక్కడ భారీ వర్షాలు కూడా పడొచ్చని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఉత్తర తెలంగాణ మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, రుతుపవన పరిస్థితి కారణంగా ఈ వర్షాలు సంభవిస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD పేర్కొంది. ఈరోజు అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేయబడింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్