బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడి మయన్మార్-బంగ్లాదేశ్ వైపు కదులుతోంది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.