ఏపీలో మూడు రోజులపాటు వర్షాలు

21చూసినవారు
ఏపీలో మూడు రోజులపాటు వర్షాలు
AP: తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు భారత వాతావరణ శాఖ శుభవార్త అందించింది. నైరుతి రుతుపవనాలు దేశంలోకి మరింతగా విస్తరిస్తున్నాయని, రాబోయే 4-5 రోజులలో కేరళ, తమిళనాడు సహా మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రాగల మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉత్తర కోస్తాంధ్ర, యానాం, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు, గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.

సంబంధిత పోస్ట్