AP: ఎల్‌నినో ప్రభావంతో ఈసారి వర్షాలు మొత్తంగా తక్కువ పడే సూచనలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. ఈ ఏడాది రుతుపవనాల దీర్ఘకాల సగటు 94%గా ఉండొచ్చని, పలు జిల్లాల్లో వర్షపాతం సాధారణం కంటే కొంత మెరుగ్గా ఉండే అవకాశముందని పేర్కొన్నారు. హిందూ మహాసముద్రం, యూరప్ మంచు వాతావరణ పరిస్థితులు వర్షపాతంపై సానుకూల ప్రభావం చూపుతాయని ఆయన పేర్కొన్నారు.