ఏపీలో మూడురోజుల పాటు వర్షాలు: వాతావరణ శాఖ

2చూసినవారు
ఏపీలో మూడురోజుల పాటు వర్షాలు: వాతావరణ శాఖ
ఆంధ్రప్రదేశ్, యానాంలలో రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం విస్తరించడంతో గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముంది. కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే ఛాన్స్ ఉందని, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్