AP: అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. ముఖ్యంగా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆత్మకూరు మండలంలో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. కోడుమూరు ప్రాంతంలో మోస్తరు వర్షం నమోదైంది. నంద్యాల, మహానంది, బండిఆత్మకూరు, పాణ్యం, ప్యాపిలి, బేతంచర్ల మండలాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. తెల్లవారుజాము నుంచి కురుస్తున్న ఎడతెరపి లేని వర్షంతో నంద్యాల పట్టణంలో రహదారులు జలమయమయ్యాయి.