నేడు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు

21చూసినవారు
నేడు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు
AP: రాష్ట్రంలో శనివారం పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే కోస్తాంధ్ర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. వర్షాలు, పిడుగుల వేళ ప్రజలు, ముఖ్యంగా రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

సంబంధిత పోస్ట్