AP: మురుసు తుఫాన్ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) అల్లూరి, ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించగా, పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తుఫాన్ ప్రభావంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.