వచ్చే 72 గంటల్లో ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు

12చూసినవారు
వచ్చే 72 గంటల్లో ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే 72 గంటల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో వర్షాలు పడొచ్చని పేర్కొంది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. వర్షాలు, గాలుల నేపథ్యంలో రైతులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్