AP: మరో 2 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మన్యం, అల్లూరి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.