AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఏలూరు, కృష్ణా,
ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, మార్కాపురం జిల్లాలతో పాటు రాయలసీమలోనూ వానలు పడే అవకాశం ఉందంది. మిగిలిన జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. పిడుగుల ముప్పు నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.