నేడు ఈ జిల్లాల్లో వర్షాలు: APSDMA

24591చూసినవారు
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు: APSDMA
AP: ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. సోమవారం అల్లూరి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో వర్షాలు పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. చెట్ల కింద నిలబడరాదని, ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని పేర్కొంది.

సంబంధిత పోస్ట్