నేడు ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్ జారీ

2చూసినవారు
నేడు ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్ జారీ
ఏపీలో నేడు పలు జిల్లాల్లో పిడుగులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మన్యం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అరకు, అనంతగిరి, బాకూరు, మడగడ, గజపతినగరం, బొబ్బిలి, మక్కువ, సాలూరు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్