ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్యకరమైన జీవనశైలి, మంచి ఆహారపు అలవాట్లు అవసరం. వ్యాధులను నివారించడానికి, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఆరోగ్య నిపుణులు ప్రతిరోజూ ఒక గుప్పెడు ఎండుద్రాక్షలను తినాలని సలహా ఇస్తున్నారు. ఎండుద్రాక్ష జీర్ణ ఆరోగ్యానికి, మలబద్ధకానికి, పైల్స్, ఫిషర్స్ నియంత్రణకు, యాసిడిటీ, అజీర్తిని తగ్గించడానికి, గుండె ఆరోగ్యానికి, రక్తపోటును అదుపుచేయడానికి తోడ్పడుతుంది. పచ్చని ద్రాక్షతో పోలిస్తే నల్లని ఎండుద్రాక్షలు ఎక్కువగా ఐరన్, ఫైబర్‌ని అందిస్తాయి.