రాజాసాబ్ సినిమా ఫలితం కారణంగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వ ప్రసాద్ పేరు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అమెరికాలో సాఫ్ట్‌వేర్ కంపెనీ నడిపే విశ్వప్రసాద్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పేరుతో టాలీవుడ్‌లో నిర్మాతగా అడుగుపెట్టారు. మూడేళ్లలో దాదాపు 15 సినిమాలు నిర్మించినా, గూఢచారి, కార్తికేయ 2, ధమాకా, మిరాయ్ తప్ప మిగతావి ఆశించిన విజయం సాధించలేదు. ఇటీవల విడుదలైన భారీ బడ్జెట్ చిత్రం రాజాసాబ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కాగా ఈ సినిమా ఫిబ్రవరి రెండో వారంలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.