బాల్య వివాహాలపై రాజస్థాన్ కఠిన చర్యలు.. పెళ్లి పత్రికలపై పుట్టిన తేదీ తప్పనిసరి

8449చూసినవారు
బాల్య వివాహాలపై రాజస్థాన్ కఠిన చర్యలు.. పెళ్లి పత్రికలపై పుట్టిన తేదీ తప్పనిసరి
రాజస్థాన్ ప్రభుత్వం బాల్య వివాహాలను అరికట్టేందుకు కీలక చర్యలు చేపట్టింది. ఇకపై పెళ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీలను ముద్రించడం తప్పనిసరి చేసింది. అక్షయ తృతీయ, పీపల్ పౌర్ణమి వంటి పవిత్ర దినాలలో జరిగే బాల్య వివాహాలను నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. 181, 100 హెల్ప్‌లైన్ నంబర్లు, 24 గంటల పర్యవేక్షణ, అవగాహన ప్రచారాలు, కఠిన చర్యలతో పాటు, వివాహ నిషేధ చట్టం 2006ను అమలు చేస్తున్నారు. బాల్య వివాహాలలో పాలుపంచుకున్న టెంట్ హౌజ్ యజమానులు, మిఠాయి వ్యాపారులు, పూజారులు, సంగీత బృందాలు, రవాణాదారులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్