డెలివరీ బాయ్‌పై ‘రాజు వెడ్స్ రాంబాయి’ హీరో అఖిల్ రాజ్ దాడి.. వీడియో వైరల్

32213చూసినవారు
హీరో అఖిల్ రాజ్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డెలివరీ బాయ్‌తో జరిగిన వివాదంలో అఖిల్ రాజ్ ఆగ్రహంగా అతడి వైపు వెళ్లగా, ఆయన తండ్రి అడ్డుకుంటున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి. అలాగే వీడియోను రికార్డ్ చేసిన వ్యక్తిని "వీడియో డిలీట్ చేయండి" అని అఖిల్ కోరినట్లు కూడా వినిపిస్తోంది. ఈ ఘటన ఆయన నివాసముంటున్న అపార్ట్‌మెంట్‌లో జరిగినట్లు తెలుస్తోంది. కాగా, 'రాజు వెడ్స్ రాంబాయి'తో గుర్తింపు పొందిన అఖిల్ రాజ్ ప్రస్తుతం సతీష్ గోగాడ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'అర్జునుడి గీతోపదేశం' చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

సంబంధిత పోస్ట్