జనన, మరణ నమోదు (సవరణ) బిల్లు-2026ను రాజ్యసభ ఆమోదించింది. విపక్షాల ఆందోళనల మధ్య మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లు జనన, మరణాల నమోదు ప్రక్రియను కఠినతరం చేస్తుంది. 21 రోజుల్లోపు నమోదుకు రుసుము లేదు, 21 రోజుల నుంచి ఒక సంవత్సరం వరకు ఆలస్యమైతే రుసుము చెల్లించాలి. రెండేళ్లలోపు ఆలస్యానికి జిల్లా లేదా సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ అనుమతి, రెండేళ్లకు మించి ఆలస్యానికి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (ఫస్ట్ క్లాస్) ఆర్డర్ అవసరం. విద్య, గుర్తింపు, ప్రభుత్వ పథకాలు, చట్టపరమైన హక్కుల కోసం జనన నమోదు ముఖ్యం.