కవలలకు జన్మనిచ్చిన రామ్ చరణ్, ఉపాసన దంపతులు

7525చూసినవారు
కవలలకు జన్మనిచ్చిన రామ్ చరణ్, ఉపాసన దంపతులు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు శనివారం రాత్రి హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో కవలలకు జన్మనిచ్చారు. మెగాస్టార్ చిరంజీవి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నారని, ఇది దైవ ప్రసాదంలా ఉందని చిరంజీవి తెలిపారు. ఈ వార్తతో అభిమానులు ఆసుపత్రి వద్ద బాణాసంచా కాలుస్తూ, మిఠాయిలు పంచుతూ సంబరాలు చేసుకుంటున్నారు. 'Mega Twins' హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. 2023లో క్లిన్ కారా జన్మించిన తర్వాత, ఇప్పుడు కవలల రాకతో మెగా కుటుంబం మరింత పెద్దదైంది.

సంబంధిత పోస్ట్