మాట నిలబెట్టుకున్న రామ్ చరణ్... 500 మంది డ్యాన్సర్లకు ఉచిత ఆరోగ్య బీమా

5621చూసినవారు
మాట నిలబెట్టుకున్న రామ్ చరణ్... 500 మంది డ్యాన్సర్లకు ఉచిత ఆరోగ్య బీమా
టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్‌లోని సుమారు 500 మంది సభ్యులు, వారి కుటుంబాలకు ఉచిత ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించేందుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముందుకు వచ్చారు. గతంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ, హెల్త్ కార్డుల పంపిణీ ప్రతిపాదనను ఆమోదించారు. సినిమా షూటింగ్‌లలో రిస్క్‌తో కూడిన ఫీట్లు చేసే డ్యాన్సర్లు ప్రమాదాలకు గురైనప్పుడు లేదా అనారోగ్యంతో బాధపడినప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం సుమారు రూ.50 లక్షల వరకు వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్