రామ్ చరణ్ సినిమా వాయిదా: ఎన్టీఆర్ రంగంలోకి దిగేనా?

6666చూసినవారు
రామ్ చరణ్ సినిమా వాయిదా: ఎన్టీఆర్ రంగంలోకి దిగేనా?
అగ్ర హీరోల చిత్రాల విడుదల తేదీల విషయంలో గందరగోళం నెలకొంది. మార్చిలో విడుదల కావాల్సిన రామ్ చరణ్ సినిమా 'పెద్ది' ఏప్రిల్ 30 నుంచి జూన్ 25కి వాయిదా పడిందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హైవోల్టేజ్ యాక్షన్ డ్రామా ఏప్రిల్ 30 - జూన్ 25 మధ్యలో విడుదలయ్యే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, ప్రశాంత్ నీల్ సినిమాలకు భారీ విజువల్ ఎఫెక్ట్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ఏప్రిల్ నాటికి సినిమా సిద్ధం కావడంపై అనుమానాలున్నాయి. '

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్