గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించిన తర్వాత, ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఈ చిత్రం డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం జూలై 2 నుంచి తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఉత్తర భారత ప్రేక్షకుల కోసం హిందీ వెర్షన్ జూలై చివరి వారంలో లేదా జూలై 30 ప్రాంతంలో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.