హాలీవుడ్ హారర్ చిత్రం 'అబ్సెషన్' గురించి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా చిత్రీకరణ విధానం, తక్కువ బడ్జెట్‌తోనే ప్రపంచవ్యాప్తంగా రూ.2,279 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం తనను ఎంతగానో ఆకట్టుకుందని వర్మ తెలిపారు. కేవలం రెండు గదులు, ఒక కారు, చిన్న స్టోర్‌లో ఐదుగురు కొత్త నటులతో సుమారు 70 లక్షల రూపాయల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం, దర్శకుడు కర్రీ బార్కర్ ప్రతిభకు నిదర్శనమని ప్రశంసించారు. బలమైన దర్శకత్వం, వినూత్న ఎడిటింగ్, అద్భుతమైన సౌండ్ డిజైన్, నటీనటుల భావోద్వేగ ప్రదర్శనతో భయాన్ని పెంచారని, ఇది ప్రస్తుత భారీ బడ్జెట్ చిత్రాలకు ఒక చెంప దెబ్బ లాంటిదని వర్మ అభిప్రాయపడ్డారు.