వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా దర్శకత్వంలో రూపొందిన సైకాలజికల్ డ్రామా ‘రావు బహదూర్’. ఈ మూవీ జూలై 3న విడుదల కానుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు సమర్పిస్తున్న ఈ చిత్రానికి ఇప్పటికే మహేష్ బాబు, సుకుమార్ వంటి ప్రముఖుల నుంచి ప్రశంసలు లభించాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. అలాగే ఇప్పిటికే ఈ మూవీ టీజర్ విడుదలై మంచి టాక్ కూడా సొంతం చేసుకుంది.